AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జాట్ కు సీక్వెల్ ..!

బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీడియోల్ గద్దర్ – 2 తో రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అదే జోష్ లో టాలీవుడ్ దర్శకుడు గోపించంద్ మలినేని దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ బాలీవుడ్ హీరో. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ యాక్షన్ డ్రామా గా వచ్చిన ఆ సినిమానే ‘జాట్’. అత్యంత భారీ బడ్జెట్ పై మైత్రీ మూవీ మేకర్స్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.

 

ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన జాట్ ఓ మాదిరి హిట్ టాక్ తెచ్చుకుంది. సన్నీ డియోల్ నటన మాస్ ఆడియెన్స్ ను మెప్పించింది. ఇక దర్శకుడు గోపీచంద్ మలినేని టేకింగ్ కు మంచి మార్కులే పడ్డాయి. సీనియర్ హీరో సన్నీ డియోల్ ను బాగా హ్యాండిల్ చేసాడని క్రిటిక్స్ పేర్కొన్నారు. కానీ రెగ్యులర్ రొటీన్ తెలుగు సినిమా టెంప్లేట్ కథలో కేవలం హీరో, విలన్ ను మాత్రమే బాలీవుడ్ నుండి తీసుకున్నాడు అనే విమర్శలు వచ్చాయి. ఇవన్నీ పక్కన పెడితే కమర్షియల్ గా జాట్ మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ను ప్రకటించారు మేకర్స్. జాట్ కు సీక్వెల్ గా జాట్ 2 ను తీసుకురాబోతున్నామని అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేసారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించబోయే ఈ సినిమా ఈ ఏడాది చివర్లో స్టార్ట్ కానుందని సమాచారం.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10