అల్లు అర్జున్‌కు ఉచ్చు బిగుసుకుంటోంది. ఇటీవలే 4 వారాలపాటు మధ్యంతర బెయిల్‌పై బయటకొచ్చిన ఆయన సంధ్య థియేటర్ ఘటనపై ప్రెస్‌మీట్ పెట్టడం మరింత దుమారం రేగుతోంది. కేసు కోర్టులో ఉండగానే.. తాను ఏ తప్పూ చేయలేదని, తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం కూడా తనకు తెలీదని బన్నీ ప్రెస్ మీట్లో చెప్పారు. ఆ మరుసటి రోజు ఆమె చనిపోయిన విషయం తెలిసి షాక్‌కి గురయ్యానన్నారు.
సినిమా చూస్తున్న సమయంలో పోలీసులు తన వద్దకు వచ్చి జరిగిన విషయం చెప్పారని అంటున్నారని.. కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు. తనను పోలీసులు కలవలేదని చెప్పారు. తనపై తప్పుడు అలిగేషన్స్ చేస్తున్నారని ఆవేదన చెందారు. తాను అన్ని జాగ్రత్తలు, పర్మిషన్స్ తర్వాతే థియేటర్ వెళ్లానని చెప్పారు. తాను రోడ్ షో చేయలేదన్నారు. ఇక సినిమా చూస్తున్న సమయంలో జనం ఎక్కువయ్యారు వెళ్లిపోవాలని మా టీమ్ చెప్పగానే వెళ్లిపోయానని చెప్పుకొచ్చారు.
దీంతో అల్లు అర్జున్ విలేకరులతో మాట్లాడటాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అతని బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఇవాళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. బెయిల్ నిబంధనలను ఉల్లంఘించి దర్యాప్తును ప్రభావితం చేసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం.