ఓయూ జెఎసి విద్యార్థుల పేరుతో కొందరు ఆందోళనకారులు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ ఆందోళనకారులని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడిపై తాజాగా అల్లు అరవింద్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారంటే..
‘‘మా ఇంటి వద్ద జరిగిన ఘటన అందరూ చూశారు. మా ఇంటికి జూబ్లీహిల్స్ పోలీసులు వచ్చి, ఆందోళన చేపట్టిన వారిపై కేసులు నమోదు చేశారు. మా ఇంటి దగ్గర ఎవరు గొడవ చేసినా పోలీసులు వాళ్ళను తీసుకెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎవరు కూడా ఇలాంటి దుశ్చర్యలు ప్రేరేపించకూడదు. ప్రస్తుతం ఈ అంశంపై సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే సంయమనం పాటిస్తున్నాం. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని తెలిపారు.