మానసిక దివ్యాంగురాలైన బాలికపై అత్యాచారం చేశాడు ఓ కిరాతకుడు. మూడు గంటలపాటు తన ఇంట్లోనే బంధించాడు నిందుతుడు. ఎంతసేపటికి బాలిక కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆదిలాబాద్‌లోని గుడిహత్నూర్ మండలంలోని ఓ కాలనీలో పోలీసులు విచారించగా.. పోశెట్టి అనే యువకుడి ఇంటి తలపులు ఎంతసేపు చూసిన తీయకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చి.. డోర్ పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా బాలిక చేతులు, కాళ్లు కట్టేసి ఒక రూమ్‌లో బంధించారు. పోశెట్టి మద్యం మత్తులో ఉండటం గుర్తించిన పోలీసులు.. వెంటనే బాలికను బయటకు తీసుకొచ్చారు.
దీంతో విషయం తెలుసుకున్న బాలిక బంధువులు, స్థానికులు పోశెట్టి ఇంటిని చుట్టిముట్టి నిందుతుడికి దేహశుద్ది చేసి, అతని ఇంటికి నిప్పు పెట్టారు. అడ్డొచ్చిన పోలీసులపై కూడా స్థానికులు దాడి చేశారు. దాడిలో రెండు పోలీసు వాహనాలను కూడా ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు స్వయంగా ఆదిలాబాద్ అడిషనల్ ఎస్పీ రంగంలోకి దిగారు. దీంతో గుడిహత్నూర్ మండలంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్‌లోని గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఓ యువకుడు మైనర్ బాలికను అపహరించి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబీకులు.. దాడికి దిగారు. బాలిక కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. యువకుడి ఇంటిపైకి రాళ్లతో దాడి చేశారు. యువకుడి ఇంటికి నిప్పు పెట్టారు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తీసుకోడానికి ప్రయత్నించారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న .. పోలీసు అధికారులపై కూడా దాడి చేశారు. దీంతో SI, CI కి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన పోలీసు అధికారులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.