AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎం రేవంత్‌తో బీజేపీ ఎంపీ అర్వింద్‌ భేటీ.. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ

– మర్యాదపూర్వకంగానే కలిసినట్లు సీఎం కార్యాలయ వర్గాల వెల్లడి

నగరంలోని జూబ్లీహిల్స్‌ నివాసంలో సీఎం రేవంత్‌ రెడ్డిని నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్‌ కూడా ఉన్నారు. సంజయ్‌ గత ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌ నుంచి జగిత్యాల ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు.

అయితే.. సడెన్‌ గా సంజయ్‌ తో కలిసి అర్వింద్‌.. రేవంత్‌ రెడ్డిని ఎందుకు కలిశారనే అంశం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. అర్వింద్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న నిజమాబాద్‌ ఎంపీ సెగ్మెంట్‌ పరిధిలోనే జగిత్యాల నియోజకవర్గం ఉంది. ఈ నేపథ్యంలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం వీరు సీఎంను కలిశారా? లేకుంటే రాజకీయ అంశాలు ఏమైనా? ఉన్నాయా అంశంపై చర్చ సాగుతోంది. ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు ఇంకా ఈ అంశంపై స్పందించలేదు. అయితే.. మర్యాదపూర్వకంగా కలిసినట్లు సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10