AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేవంత్ మరో సంచలనం-బాలకృష్ణ, జానారెడ్డి ఇళ్లకు హైడ్రా మార్కింగ్..!

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అరెస్టు వివాదం ముగియక ముందే తెలంగాణ ప్రభుత్వం మరో సంచలనానికి తెరలేపింది. ఇప్పటికే హైదరాబాద్ లో అక్రమంగా చెరువుల్ని, పార్కుల్ని ఆక్రమించుకున్న వారిపై బుల్ డోజర్లతో కూల్చివేతలకు దిగుతున్న ప్రభుత్వం.. ఇవాళ ఇద్దరు సినీ, రాజకీయ ప్రముఖుల ఇళ్లకు హైడ్రాతో మార్కింగ్ వేయించింది. త్వరలో వీటిని కూల్చివేసేందుకు సిద్ధమవుతోంది.

హైదరాబాద్ లో ఇవాళ సినీ నటుడు నందమూరి బాలకృష్ణతో పాటు కాంగ్రెస్ మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ఇంటికి హైడ్రా అధికారులు స్వల్పంగా మార్కింగ్ వేశారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లై ఓవర్, అండర్ పాస్ నిర్మాణాలకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది. ఈ నేపథ్యంలో వీరి ఇళ్లతో పాటు పలు నిర్మాణాలకు హైడ్రా అధికారులు మార్కింగ్ చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే హైదరాబాద్ లో హీరో అక్కినేని నాగార్జున కు చెందిన ఎన్ కన్వెషన్ ను హైడ్రా కూల్చేసింది. దీనిపై కోర్టుకు వెళ్లినా నాగార్జున దాన్ని కాపాడుకోలేకపోయారు. ఇప్పుడు బాలయ్య, జానారెడ్డి ఇళ్లకు మార్కింగ్ వేయడంతో వీటి విషయంలో ప్రభుత్వం దూకుడుగా ముందుకెళ్తుందా, అదే జరిగితే వీరు ఎలా స్పందించబోతున్నారనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన నాగార్జున, అల్లు అర్జున్ ల విషయంలో దూకుడుగా ముందుకెళ్లిన ప్రభుత్వం.. ఇప్పుడు బాలయ్యకు సంబంధించిన నిర్మాణాలను కూడా టార్గెట్ చేస్తోందా అన్న చర్చ జరుగుతోంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10