సినీ హీరో అల్లు అర్జున్‌పై తమకు ఎలాంటి కక్ష లేదని, మహిళ చనిపోతే అరెస్ట్ చేయొద్దా అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. రేవతి కుమారుడు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని చెప్పారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడారు. తెలుగు చిత్ర సీమ హైదరాబాద్‌కు రావడానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రులే కారణమని చెప్పారు.
టాలీవుడ్‌కి, కాంగ్రెస్ పార్టీకి విడదీయరాని బంధం ఉందని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ సర్కారు కృషి వల్లే అప్పట్లో టాలీవుడ్ హైదరాబాద్‌కు వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వమే స్టూడియోల నిర్మాణానికి భూములు ఇచ్చిందని తెలిపారు.
మరోవైపు, తెలంగాణ తల్లి విగ్రహంపై వస్తున్న విమర్శలను మహేశ్ కుమార్ గౌడ్ తిప్పికొట్టారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని నిలదీశారు. ఎమ్మెల్సీ కవిత రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టే ముందు పదేళ్లలో వారు అనుభవించిన పదవుల గురించి చర్చ పెట్టాలని అన్నారు. కాగా, పార్టీ బలోపేతం కావాలంటే కొంతమంది కొత్త వారికి పదవులు ఇస్తే తప్పేంటని అన్నారు.