ఝార్ఖండ్ రాష్ట్రంలో తక్షక నాగుపాము ప్రత్యక్షమైంది. తక్షకుడనే పాము అనాడు భారతదేశాన్ని పారిపాలించిన పరీక్షిత్తును కాటేసినట్లు మహాభారతంలో చదువుకున్నాం. అయితే, అదే పేరుతో పిలిచే ఓ అరుదైన పాము ఝార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ పట్టణంలో దర్శనమిచ్చింది.
ఓ ప్రభుత్వ కార్యాలయంలోకి ఎక్కడి నుంచో చొరబడిన ఆ పామును చూసి అక్కడున్న అధికారులు భయంతో వణికిపోయారు. మామూలు పాములకు భిన్నంగా ఉన్న ఆ సర్పాన్ని చూసిన వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
కాగా, అంతరించిపోతున్న పాముల జాబితాలో ఉన్న తక్షక నాగు ఎక్కువగా చెట్లపైనే నివసిస్తూ ఉంటుంది. ఒక చెట్టు మీది నుంచి మరో చెట్టు మీదకు గాల్లోనే 100 అడుగుల మేర జంప్ చేయగలిగే సామర్థ్యం తక్షక నాగు సొంతం. అది వందల ఏళ్లు బతుకుతుందనే నమ్మకం ఉత్తర భారతదేశంలోని పలు గ్రామాల్లో ప్రచారంలో ఉంది.