AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రియాంక గాంధీతో రేవంత్, భట్టి భేటీ

ఎంపీగా విజయం సాధించినందుకు అభినందనలు

ఏఐసీసీ అగ్రనేత, వయనాడ్‌ ఎంపీ ప్రియాంక గాంధీని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కలిశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఇటీవల వయనాడ్‌ ఎంపీగా గెలిచిన ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. ప్రియాంక గాంధీకి పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు. ఎంపీగా భారీ మెజారిటీతో విజయం సాధించినందుకు ఆమెకు అభినందనలు తెలియజేశారు.

అనంతరం ప్రియాంక గాంధీతో సమావేశమై తెలంగాణ రాజకీయాల గురించి చర్చించారు. కాగా పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ లో ఉన్న తెలంగాణ ఎంపీలతో సమావేశం అయ్యేందుకు రేవంత్‌ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. కేంద్రం వద్ద పెండింగ్‌ లో ఉన్న తెలంగాణ అంశాలపై ఎంపీలతో జరిగే సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి చర్చించనున్నారు.

ANN TOP 10