AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వీడ్కోలు చెప్పాల్సిన సమయం వచ్చేసింది.. స్మితా సబర్వాల్ ఎమోషనల్ ట్వీట్..!

డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్‌గా పేరు పొందిన స్మితా సబర్వాల్ తెలంగాణ ప్రజలందరికీ సుపరిచితమే. అటు తన పనితీరుతోనే కాదు.. సమాజంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఎలాంటి మొహమాటం లేకుండా తన అభిప్రాయాలు వెల్లడిస్తూ.. డేరింగ్ అండ్ డాషింగ్ అధికారిగా పేరు తెచ్చుకున్నారు. కాగా.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ.. నెటిజన్లకు నిత్యం టచ్‌లో ఉంటారు స్మితా సబర్వాల్. బయట జరుగుతున్న విషయాలపై స్పందిస్తుండటమే కాకుండా.. వ్యక్తిగత జీవితంలో జరిగే విషయాలను కూడా తన ఫాలోవర్లతో ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోల రూపంలో పంచుకుంటుంటారు. ఈ క్రమంలోనే.. స్మితా సబర్వాల్ ఆదివారం (నవంబర్ 24న) ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.

వీడ్కోలు చెప్పాల్సిన సమయం వచ్చేసిందంటూ స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు. అదేంటీ స్మితా సబర్వాల్ ఎక్కడికి వెళ్తున్నారనేగా మీ డౌటనుమానం. ఆమె ఎక్కడికీ వెళ్లట్లేదు. తెలంగాణకు తిరిగి వస్తున్నారు. అదేంటీ అనుకుంటున్నారా. అయితే.. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు గానూ.. స్మితా సబర్వాల్‌ను మహారాష్ట్రలోని బుల్దానా, మల్కాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎలక్షన్ జనరల్ అబ్జార్వర్‌గా కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. దీంతో.. సుమారు నెల రోజులుగా స్మితా సబర్వాల్ మహారాష్ట్రలో తన సేవలందిస్తున్నారు. అయితే.. నిన్న (నవంబర్ 23న) మహారాష్ట్ర ఫలితాలు వెలువడగా.. నిన్నటితో స్మితా సబర్వాల్ స్పెషల్ డ్యూటీ ముగిసింది. దీంతో.. ఈరోజు (నవంబర్ 24) ఆమె మహారాష్ట్రను వదిలి తెలంగాణకు పయనమయ్యారు. ఈ క్రమంలోనే.. ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు స్మితా సబర్వాల్.

దాదాపు నెల రోజుల ఎన్నికల డ్యూటీ తర్వాత మహారాష్ట్ర నుంచి బయలుదేరాల్సిన సమయం వచ్చేసింది. ఎంతో ఆప్యాయతతో మాట్లాడే, సున్నిత మనస్కులు, కర్తవ్యబద్దులైన ఉద్యోగులు ఇలా అందరూ ఎప్పటికీ మర్చిపోలేని ప్రభావాన్ని మిగిల్చారు. ఇక్కడి ప్రతి గ్రామంలోని ప్రతి మూలలో మన చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తాయి.” అంటూ స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు.

ANN TOP 10