AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చలి పులి పంజా.. తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత

ఉష్ణోగ్రతలు 2, 3 డిగ్రీలు తగ్గుతాయని వాతావరణ శాఖ వెల్లడి

తెలంగాణలో చలి పులి పంజా విసురుతోంది. రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు 2, 3 డిగ్రీలు తగ్గుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో గాలి వేగం గంటకు 30 కిలోమీటర్లుగా ఉందని.. తెలంగాణలో గంటకు 10 కిలోమీటర్లుగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం భారత్ చుట్టుపక్కల నాలుగు ఆవర్తనాలు కేంద్రీకృతమై ఉండటంతో గాలుల వేగం కాస్త పెరిగిందన్నారు. తెలంగాణలో మాగ్జిమం ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని చెప్పారు. తెలంగాణలో తేమ 40 శాతం కంటే తక్కువగా ఉందని అన్నారు.

సాయంత్రం, రాత్రి, ఉదయం వేళల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనూ చలి తీవ్రత పెరిగింది. ఆయా ఏరియాల్లో ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. రానున్న రోజుల్లో మరింతగా తగ్గే అవకాశం ఉన్నట్లు చెప్పారు. చలి పెరుగుతున్న నేపథ్యంలో వృద్ధులు, చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వెచ్చని దుస్తులు ధరించాలని, వేడి ఆహారం మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు.

కాగా వర్షాలపై హైదరాబాద్ వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో దక్షిణం, ఉత్తరాన రెండు ఆవర్తనాలు ఉన్నాయని చెప్పారు. అయితే వాటి ప్రభావం ఏపీ, తెలంగాణలపై ప్రస్తుతానికి లేదన్నారు. అయితే ఈనెల 26 లేదా 27 తేదీల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు. దాని ప్రభావంతో రాయలసీమ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. తెలంగాణలోని దక్షిణ తెలంగాణ జిల్లాల్ల్లో వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10