AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

స్పెషల్‌ బ్యారక్‌లో ఉంచండి.. క్వాష్ పిటిషన్‌పై విచారణలో హైకోర్టు కీలక ఆదేశాలు

ఇంటి భోజనానికి అనుమతివ్వండి
క్వాష్ పిటిషన్‌పై విచారణలో హైకోర్టు కీలక ఆదేశాలు
పట్నం నరేందర్‌రెడ్డికి  స్వల్ప ఊరట..

(హైదరాబాద్‌, మహా):
వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి కేసు ఘటనలో అరెస్ట్ అయి ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. నరేందర్ రెడ్డికి చర్లపల్లి జైలులో స్పెషల్ బ్యారక్ ఇవ్వాలని, ఇంటి భోజనం అనుమతించాలని చర్లపల్లి జైలు సూపరింటెండెంట్‌ను న్యాయస్థానం ఆదేశించింది.

లగచర్లకు ఫ్యాక్ట్‌ ఫైండింగ్ కమిటీ..
ఇక లగచర్లలో పలువురు రైతులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇప్పటకీ అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు గ్రామాల్లోకి వచ్చి ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో లగచర్ల ఘటనలో ప్రస్తుత పరిస్థితులను తెలుసుకునేందుకు.. ఘటనకు సంబంధించి అసలు వాస్తవాలు తెలుసుకునేందుకు మహిళా సంఘాల జేఏసీ నేతలు లగచర్లకు బయల్దేరారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై మహిళా సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమతో పాటుగా పోలీసులను కూడా రావాలని కోరినా.. వినిపించుకోవటం లేదని, మమ్మల్ని కూడా అనుమతించటంలేదని మండిపడ్డారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసేందుకు వెళ్తున్న మమ్మల్ని ఆపాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. పోలీసులు మహిళలపై దౌర్జన్యాలు, లైంగిక వేధింపులకు పాల్పడకపోతే తమను అక్కడకు వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. పోలీసులు, ప్రభుత్వ తీరుపై తమకు అనుమానంగా ఉందని మహిళా సంఘాల నేతలు వ్యాఖ్యానించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10