AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడు వ‌రంగ‌ల్ లో ప్ర‌జాపాల‌న విజ‌యోత్స‌వాలు.. హాజ‌రుకానున్న సీఎం రేవంత్

ప్రజాపాల‌న‌కు ఏడాది పూర్తైన సంద‌ర్భంగా కాంగ్రెస్ ప్ర‌భుత్వం నేడు ప్ర‌జా పాల‌న విజ‌యోత్స‌వ వేడుక‌ల‌ను వ‌రంగల్ లో నిర్వ‌హిస్తోంది. ఈ నేప‌థ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నేడు జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. వ‌రంగ‌ల్, హ‌న్మ‌కొండ‌, కాజీపేట‌లో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు ఆయ‌న శంకుస్థాప‌న చేయ‌నున్నారు. హైద‌రాబాద్ త‌ర‌వాత రాష్ట్రంలో అతిపెద్ద న‌గ‌రం కావ‌డంతో వ‌రంగ‌ల్ అభివృద్ధి కోసం ప్ర‌భుత్వం భారీగా నిధులు కేటాయిస్తూ అభివృద్ధికి ప్ర‌ణాళిక‌లు ర‌చించింది.

2041 మాస్ట‌ర్ ప్లాన్ తో వ‌రంగ‌ల్ స‌మ‌గ్రాభివృద్ధికి ప్ర‌ణాళిక‌లు ర‌చించింది. ఈ నేప‌థ్యంలోనే వరంగల్ మహా నగరం అబివృద్దికి గతంలో ఎన్నడూ లేని విధంగా రూ. 4962.47 కోట్లు కేటాయించింది. సీఎం ఆదేశాలతో వివిధ విభాగాల పరిధిలో నగరంలో చేపట్టే పనులకు నిధులు మంజూరు చేసింది. వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి రూ.4,170 కోట్లు, మామునూరు ఎయిర్ పోర్ట్ భూసేకరణకు రూ. 205 కోట్లు, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కోసం రూ.160.92 కోట్లు, టెక్స్ టైల్ పార్కులో రోడ్లు, స్కూల్స్, సదుపాయాల కోసం రూ.33.60 కోట్లు, టెక్స్ టైల్ పార్క్ కు భూములు ఇచ్చిన రైతులకు 863 ఇందిరమ్మ ఇండ్ల కోసం రూ. 43.15 కోట్లు. కాళోజీ కళాక్షేత్రం కోసం రూ.85 కోట్లు కేటాయించారు.

పరకాల నుంచి ఎర్రగట్టు గుట్ట వరకు రోడ్డు విస్తరణకు రూ. 65 కోట్లు, నయీమ్ నగర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.8.3 కోట్లు, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ కోసం రూ. 32.50 కోట్లు, ఇన్నర్ రింగ్ రోడ్డుకు రూ.80 కోట్లు, భద్రకాళి ఆలయం వద్ద పాలిటెక్నిక్ కాలేజీ న్యూ బిల్డింగ్ కోసం రూ.28 కోట్లు, గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్ల కోసం రూ. 49.50 కోట్లు, వరంగల్ ఉర్దూ భవన్, షాదీ ఖానా కోసం 1.50 కోట్లు కేటాయించారు. ఈ ప‌ర్య‌ట‌న కోసం మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు సీఎం హ‌న్మకొండ‌కు బ‌య‌లుదేరుతారు. ప‌ర్య‌ట‌న‌లో ప‌లువురు మంత్రులు, ప్ర‌జాప్ర‌తినిధులు సైతం పాల్గొంటారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10