బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే మీకు మరో గుడ్ న్యూస్.. అక్టోబర్ నెల వరకు గరిష్టస్థాయికి చేరుకున్న గోల్డ్,వెండి ధరలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. కార్తీక మాసం, దీంతోపాటు పెళ్లిల్ల సీజన్ కావడంతో గోల్డ్ కొనుగోలు చేసేవారు ఎక్కువే .. ఈటైమ్‌లో బంగారం ధరలు(Gold Rate) తగ్గడంతో గోల్డ్ కొనేవారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గెలవడంతో ఆ ఎఫెక్ట్ బంగారంపై పడింది.
ఈ నేపథ్యంలో రోజు రోజుకి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారంతో పోల్చుకుంటే.. నేడు(బుధవారం నవంబర్ 13) గ్రాముకి రూ.400 తగ్గింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.70,450 కి చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.76,850 వరకు తగ్గింది. ఇక ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం పదండి.
ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్(Gold Rate)..
ఢిల్లీలో గోల్డ్ రేట్స్ చూస్తే.. 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర(Gold Rate) రూ. 70,600కి చేరుకుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.77,000 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.76,850 వరకు తగ్గింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.70,450కి చేరుకుంది.
ముంబైలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.76,850 వరకు తగ్గింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.70,450కి చేరుకుంది.
బెంగుళూరులో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.76,850 వరకు తగ్గింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.70,450 వద్ద కొనసాగుతోంది.
కేరళ, కోల్ కత్తాలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.76,850 వరకు తగ్గింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.70,450వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూస్తే..
హైదరాబాద్, తెలంగాణలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర(Gold Rate) రూ.76,850 వరకు తగ్గింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.70,450కి చేరుకుంది.
విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.76,850 వరకు తగ్గింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.70,450వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు(Silver Price)
బంగారం ధరలు మాదిరిగా వెండి ధరలు కూడా స్థిరంగా తగ్గతూ వస్తున్నాయి. బుధవారం నాడు రూ.1000 తగ్గింది. చెన్నై, హైదరాబాద్, కేరళ, విజయవాడలో కిలో వెండి ధర రూ.1,01,000 కి చేరుకుంది.
ఢిల్లీ, బెంగుళూరులో వెండి ధరలు మరింత తగ్గాయి. కిలో వెండి ధర రూ.91,000 ఉంది.