AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాశ్మీర్‌లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం.. కుక్క బిస్కెట్లతో ఆపరేషన్‌ ..

జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో  ఓ ఎన్‌కౌంటర్ జరిగింది. అయితే శ్రీనగర్‌లోనే అత్యంత జనసాంద్రత ఉన్న ఖన్యార్ ప్రాంతంలో నక్కి ఉన్న లష్కరే తోయిబా టాప్ కమాండర్ ఉస్మాన్‌ను పక్కా ప్లాన్ వేసి, వల పన్ని పట్టుకుని హతమార్చారు. ఈ ఆపరేషన్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న భద్రతా బలగాలు.. ఇందుకోసం భారీ ప్రణాళికను రచించింది.

శ్రీనగర్‌లో అత్యంత రద్దీగా ఉండే ఖన్యార్ ప్రాంతంలో ఉండే ఉస్మాన్‌ను పట్టుకునేందుకు వెళ్లగా అక్కడ తెలిసిన ప్రాంతం కావడంతో ఉస్మాన్ పరారీ అయ్యే అవకాశాలు ఉన్నాయని భద్రతా బలగాలు ముందుగానే పసిగట్టాయి. పైగా ఆ ప్రాంతంలో వీధి కుక్కల బెడద అధికంగా ఉండటంతో సైన్యానికి మరో సవాల్‌గా మారింది. ఇందుకు సైనికులు సరికొత్త ప్లాన్‌ను వేశారు. అది సక్సెస్ అయి.. ఉస్మాన్ దొరకడంతో అతడ్ని హతమార్చారు.

గత 2 ఏళ్లలో శ్రీనగర్‌లో చోటుచేసుకున్న కీలక ఎన్‌కౌంటర్‌ ఇదే కావడం గమనార్హం. ఈ ఆపరేషన్‌ సక్సెస్ వెనుక.. కుక్క బిస్కెట్లు ఉన్నాయని చెప్పడం అతిశయోక్తి కాదు. ఖన్యార్ ప్రాంతంలో ఉస్మాన్ ఉన్నాడని పక్కగా నిఘా సమాచారం అందుకున్న పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు ఆ ప్రాంతం మొత్తాన్ని చుట్టుముట్టారు. ఎలాగైనా సరే ఉస్మాన్‌ను పట్టుకునేందుకు అప్పటికే పకడ్బందీగా ప్లాన్‌ను తయారు చేసుకున్నారు. ఆ ప్రాంతంలో వీధి కుక్కల సమస్య అధికంగా ఉండటం వారికి సవాల్‌గా మారింది. ఎక్కడ వీధి కుక్కలు మొరిగితే ఉస్మాన్ అలర్ట్ అయి.. అక్కడి నుంచి పరారయ్యే అవకాశాలు ఉన్నాయని గుర్తించిన భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. ఇక ఆ పరిసరాలపై పూర్తి పట్టు ఉన్న ఉస్మాన్.. అక్కడి నుంచి తప్పించుకునే అవకాశం ఉండటంతో జవాన్లు పూర్తి అప్రమత్తతతో వ్యవహరించారు.

ఈ సమస్య పరిష్కారానికి ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న సైనికులు.. తమ వెంట కుక్క బిస్కెట్లను తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే కనిపించిన కుక్కలకు ఆహారంగా బిస్కెట్లను వేస్తూ.. అవి అరవకుండా చూసుకున్నారు. చివరికి అతడు ఉన్న ప్రాంతాన్ని పక్కాగా గుర్తించారు. అయితే భద్రతా బలగాల రాకను గుర్తించిన ఉస్మాన్ వారిపైకి కాల్పులు జరిపి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. దీంతో వెంటనే ఎదురుకాల్పులు ప్రారంభించిన సైనికులు.. అతడ్ని అక్కడికక్కడే మట్టుబెట్టాయి. దీంతో లష్కరే తోయిబాకు బిగ్ షాక్ తగిలింది.

ANN TOP 10