AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాసేపట్లో.. తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలు చర్చించే అవకాశం..

తెలంగాణ కేబినెట్ సమావేశం  శనివారం జరుగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అధ్యక్షతన సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది. ఇందులో పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే కొన్ని ముఖ్య అంశాలపై కూడా మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది.

ముఖ్యంగా మూసీ పునరుజ్జీవంపై, నిర్వాసితులకు సహాయంపై చర్చ జరుగనుంది. ధరణి పోర్టల్‌ పేరును ‘భూమాత’గా మార్చడానికి కొత్త ఆర్వోఆర్‌ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే. ధరణిలో రైతుల హక్కులపై ఏర్పడే సమస్యల పరిష్కారానికి అప్పిలేట్‌ అథారిటీని ఏర్పాటు చేయడానికి ఈ చట్టంపై చర్చిస్తారని తెలుస్తోంది. మూసీ పునరుజ్జీవ చర్యలు, హైడ్రా, 317 జీవో, ఉద్యోగుల డీఏలు, ధాన్యం కొనుగోళ్లు, కొత్త రేషన్‌ కార్డుల జారీ తదితర అంశాలపై కేబినెట్ భేటీ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ANN TOP 10