AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణాకు కొరియా షూ కంపెనీ !

తెలంగాణలో పెట్టుబడులకు మరో అంతర్జాతీయ సంస్థ ముందుకొచ్చింది. మెడికల్‌, స్మార్ట్‌ బూట్ల ఉత్పత్తిలో అగ్రగామి కొరియన్‌ కంపెనీ షూఆల్స్‌ రాష్ట్రంలో కంపెనీ ఏర్పాటుకు ఆసక్తి కనబరిచింది. రూ.300 కోట్ల పెట్టుబడులతో సంస్థ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను మంత్రి శ్రీధర్‌బాబుకు అందజేసింది.

కంపెనీ ఏర్పాటుకు 750 ఎకరాల భూమి కేటాయించాలని కోరింది. కొరియా నుంచి వచ్చిన షూఆల్స్‌ ఛైర్మన్‌ చెవోంగ్‌లీతో పాటు సంస్థ ప్రతినిధులు గురువారం సచివాలయంలో శ్రీధర్‌బాబును కలిశారు. 87 వేల మందికి ఉద్యోగాలు కల్పించే ”గిగా ఫ్యాక్టరీ” ప్రతిపాదనను ఆయన ముందుంచారు.

అడుగు భాగాన (సోల్స్‌) మెడికల్‌ చిప్‌ ఉండే బూట్లు, పదివేల అడుగులు వేస్తే గంటకు 25 వాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే షూతో పాటు డయాబెటీస్‌, ఆర్థరైటిస్‌ ఉన్న వారికి ఉపశమనం, స్వస్థత కలిగించే పలురకాల ఉత్పత్తులతయారీ గురించి ప్రతిపాదనలు అందజేశారని మంత్రి వెల్లడించారు.

బూట్ల తయారీలో జంతువుల చర్మాన్ని వినియోగించడం వల్ల ట్యానరీలు అవసరమవుతాయని, ఇలా యాన్సిల్లరీ పరిశ్రమలతో అనేక మందికి ఉపాధి దొరుకుందని మంత్రి వెల్లడించారు. ప్రపంచ మార్కెట్లకు తెలంగాణా హబ్‌గా మారుతోందన్నారు.

ANN TOP 10