AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పరువు నష్టం కేసుపై విచారణ.. రేపు కోర్టు మెట్లు ఎక్కనున్న నాగార్జున?

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
నటుడు నాగార్జున పిటిషన్‌పై నాంపల్లి మనోరంజన్‌ కోర్టులో సోమవారం విచారణ జరిగింది. నాగార్జున తరపున వాదనలను సీనియర్‌ కౌన్సిల్‌ అశోక్‌ రెడ్డి వినిపించారు. రేపు (మంగళవారం) పిటిషనర్‌ నాగార్జున స్టేట్మెంట్‌ రికార్డ్‌ చేస్తామని కోర్ట్‌ తెలిపింది. రేపు కోర్ట్‌కు నాగార్జున హాజరు కానున్నారు. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలని రేపే నమోదు చేయాలని నాగార్జున తరపున న్యాయవాది అశోక్‌ రెడ్డి కోరారు. తదుపరి విచారణను నాంపల్లి కోర్టు రేపటికి వాయిదా వేసింది.

తెలంగాణ మంత్రి కొండా సురేఖ తాజాగా హీరో అక్కినేని ఫ్యామిలీపై చేసిన కామెంట్స్‌ వ్యవహారం చివరికి నాంపల్లి కోర్టు మెట్లెక్కిన విషయం తెలిసిందే. తన కుటుంబ ప్రతిష్టను, గౌరవాన్ని దెబ్బతీసేలా మంత్రి సురేఖ మాట్లాడారని, తన పరువుకు భంగం కలిగిందంటూ నాగార్జున 100 కోట్ల మేర పరువు నష్టం దావా వేశారు.

మంత్రి సురేఖ తనపై జరిగిన సోషల్‌ మీడియా ట్రోలింగ్స్‌ పట్ల స్పందిస్తూ.. మాజీ మంత్రి కేటీఆర్‌ లక్ష్యంగా కామెంట్స్‌ చేశారు. అలాగే అక్కినేని నాగార్జున, సమంతా పేర్లను ఉచ్చరిస్తూ.. కొంత వివాదాస్పద రీతిలో మాట్లాడారు. అనంతరం సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల సినీలోకం విరుచుకు పడిందని చెప్పవచ్చు.

ANN TOP 10