AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

యంగ్ ఇండియా స్కూల్స్ రాబోతున్నాయ్.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా.. 25 ఎకరాల్లో పాఠశాల.. సాంకేతిక పరిజ్ఞానంతో విద్య.. చదువు పూర్తి చేసుకున్న సమయానికి అవకాశాలు.. ఇటువంటి పెద్ద ప్రణాళికతో విద్యాపథంలో రాణించేందుకు ముందడుగు వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అందులో ఉచిత విద్య రూపేణా ఇన్ని అవకాశాలు కల్పించేందుకు సీఎం రేవంత్   ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. పేద, ధనిక తేడా లేకుండా ప్రతి విద్యార్థికి.. నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ నిర్ణయం   ముఖ్య ఉద్దేశం.

తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలలో యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణంకు రేవంత్ సర్కార్ ముందడుగు వేసినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క   ప్రకటించారు. ఈ స్కూల్స్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని, ప్రాముఖ్యతను మీడియాకు డిప్యూటీ సీఎం వివరించారు. రాష్ట్రంలో రూ.5 వేల కోట్ల నిధులతో యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. దసరా సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు శంకుస్థాపన చేయడం జరుగుతుందని, విద్యా ప్రమాణాల పెంపుకు ఈ స్కూల్స్ దోహదపడతాయన్నారు.

ఈ స్కూల్స్ నిర్మాణం కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో 20-25 ఎకరాల్లో సాగుతుందని, 12వ తరగతి వరకు ఉచిత విద్యాబోధన అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. 25 నియోజకవర్గాల్లో ఇప్పటికే భూమి వివరాల సేక‌ర‌ణ‌ పూర్తయిందని, త్వరలోనే వీటి నిర్మాణానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఇక్కడ క్రీడలు, వినోదంతో సహా ఆల్‌రౌండ్ డెవలప్‌మెంట్‌పై దృష్టి విద్యార్థులు శాటిలైట్ ఆధారిత విద్య అందించే ప్రణాళిక రూపొందిస్తున్నట్లు.. ఇప్పటికే పలు దఫాలుగా అధికారులతో చర్చించడం జరిగిందన్నారు.

ANN TOP 10