AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘పాలమూరు’ను పూర్తి చేసితీరుతాం.. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టీకరణ

ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ పనుల పరిశీలించిన మంత్రులు
(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి తీరుతామని రాష్ట్ర మంత్రులు స్పష్టం చేశారు. బుధవారం మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల పరిధిలోని ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ పనుల పురోగతిని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ మాట్లాడుతూ..పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌ ప్రభుత్వానికి ఎంతో ప్రాధాన్యమైందని చెప్పారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు.

నిర్వాసితులను ఆదుకుంటాం
ఉదండాపూర్‌ ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు రూ.45 కోట్లు విడుదల చేశామన్నారు. మిగతా నిధులు కూడా త్వరలో విడుదల చేస్తామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. వారి వెంట నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు అనిరుధ్‌ రెడ్డి, జి.మధుసూదన్‌ రెడ్డి, ఈర్లపల్లి శంకర్, వాకిటి శ్రీహరి యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి, తదితరులు ఉన్నారు.

ANN TOP 10