AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గుజ‌రాత్‌లో ఘోర ప్ర‌మాదం.. ఏడుగురు మృతి

అహ్మ‌దాబాద్ : గుజ‌రాత్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. స‌బ‌ర్‌కాంతా జిల్లాలోని హిమ్మ‌త్ న‌గ‌ర్ వ‌ద్ద కారు – లారీ ఢీకొన్నాయి. దీంతో కారులో ప్ర‌యాణిస్తున్న ఏడుగురు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్ర‌మాదానికి అతి వేగ‌మే కార‌ణ‌మ‌ని పోలీసులు నిర్ధారించారు. కారు పూర్తిగా ధ్వంసంమైంది. కారు శ్యామ‌ల‌జీ నుంచి అహ్మ‌దాబాద్ వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. మృతుల నివాసాల్లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

ANN TOP 10