తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర పరిధిలో శుక్రవారం రాత్రి పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షంతో నగర పరిధిలోని వివిధ ప్రాంతాలు జలమయం అయ్యాయి. బాలా నాగర్, నాంపల్లి, జీడిమెట్ల, హిమాయత్ నగర్, తార్నాక, కోఠి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, సరూర్ నగర్, రామంతపూర్, ఎల్బీనగర్, హయత్ నగర్, పెద్ద అంబర్ పేట, ఉప్పల్, బంజారా హిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట తదితర ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో వాహన చోదకులు పలు ఇబ్బందుల పాలయ్యారు.
