(అమ్మన్యూస్, హైదరాబాద్):
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మనవడు రేయాన్ష్ రెడ్డి డ్యాన్స్ అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ముఖ్యమంత్రి నివాసంలో పూజలను అందుకున్న వినాయకుడి విగ్రహం సైతం నిమజ్జనానికి తరలించారు. అందంగా అలంకరించిన ప్రత్యేక వాహనంలో గణేషుడి విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించారు. చివరి రోజు వినాయకుడికి ఘనంగా పూజలను నిర్వహించారు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు.
ఆయన భార్య గీతా రెడ్డి, కూతురు నైమిష రెడ్డి, మనవడు రేయాన్ష్ రెడ్డి ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేయాన్ష్రెడ్డి వినాయకుడి మండపం వద్ద స్టెప్పులేశాడు. సంప్రదాయబద్ధ వస్త్రధారణతో కనిపించాడు. డప్పు శబ్దాలకు అనుగుణంగా హుషారుగా చిందులేయడంతో అందరూ మంత్రముగ్ధులయ్యారు.
#Telangana cm #Revanthreddy Grand son dances while #Ganeshimmersion
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటి వినాయకుడు నిమర్జనం కు తరలించి సమయం లో రేవంత్ రెడ్డి మనవడు డ్యాన్స్ తో అదరగొట్టాడు..రేవంత్ రెడ్ తన మనవడు డ్యాన్స్ చెయ్యడం చూసి రేవంత్ బాగా ఎంజాయ్ చేశారు..#Ganeshnimarjanam2024 pic.twitter.com/hHwSyjzXOQ
— SHRA.1 JOURNALIST✍ (@shravanreporter) September 16, 2024