దుష్ట సంప్రదాయాలకు తెరలేపుతున్న సీఎం
ఎన్ని ‘హైడ్రా’మాలాడినా వదిలిపెట్టం
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటైన వ్యాఖ్యలు
(అమ్మన్యూస్, హైదరాబాద్):
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెచ్చిపోయారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అమెరికా నుంచి హైదరాబాద్ తిరిగొచ్చిన కేటీఆర్.. శనివారం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డి, అరికెపూడి గాంధీలపై ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. దమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయాలని, కోర్టు తీర్పుతో వారిలో వణుకు మొదలైందని అన్నారు.
చిల్లర ఎత్తుగడలు..
రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని మోసం చేసిన ఘన రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లేక రేవంత్ తొత్తులు చిల్లర ఎత్తుగడలు వేస్తున్నారని మండిపడ్డారు. సీఎం స్వయంగా ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి కండువాలు కప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్‌లో చేరినట్లు ప్రచారం చేసుకుని.. హైకోర్టు తీర్పు తరువాత స్వరం మార్చారని విమర్శించారు. రాష్ట్రంలో తొమ్మిది నెలలుగా ఒక వైపు హెడ్ లై¯Œ మేనేజ్‌మెంట్ చేస్తున్నారని.. గారడి మాటలు చెబుతున్నారని రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
దమ్ముంటే రండి…
‘స్పీకర్ మీరు తప్పు చేస్తున్నారని ముందే చెప్పాం.. ఫిరాయింపు దారులపై కౌశిక్ రెడ్డి, జగదీష్ రెడ్డి, వివేకానందలు కోర్టులో కేసు వేశారు. కౌశిక్ రెడ్డి ఏం తప్పు మాట్లాడాడు. నాలుగు వారాల్లో నిర్జయం తీసుకోవాలని కోర్టు్ట చెప్పింది. హై కోర్టు తీర్పు వల్ల ప్రజాస్వామ్యాన్ని గౌరవించారు. దమ్ముంటే రండి అన్నారు. ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం అన్నారు. పార్టీ మారిన గాంధీని పీఏసీ చైర్మన్‌గా నియమించారు. ఆయన ఏ పార్టీలో ఉన్నారని అడిగారు. అందులో తప్పేముంది? పదవి పోతుందని ఇప్పుడు బీఆర్‌ఎస్ పార్టీలోనే ఉన్నారని చెబుతున్నారు.’ అని కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
గూండాలతో దాడి చేయించారు..
‘గూండాలతో దాడి చేశారు. రూమ్ అద్దాలు పగలగొట్టారు. ఏమైనా అయితే ఎవరు బాధ్యులు? ఈ దాడికి ముఖ్యమంత్రే బాధ్యత వహించాలి. ఫ్యాక్షన్ ∙సినిమాను తలపించారు. చేతగాని సీఎం, హోం మంత్రి వల్లనే ఇలా జరిగింది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేని ముఖ్యమంత్రి. సీఎంగా ఆయన చేసిందేమీ లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడ ఉన్నాయి. కౌశిక్ రెడ్డే కాదు నేను కూడా అడుగుతున్నా.. గాంధీ నువ్వు అసలు ఏ పార్టీలో ఉన్నవ్? ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఏ పార్టీలో ఉన్నారో సమాధానం చెప్పాలి? 6 గ్యారంటీలు ఎక్కడ? హైడ్రా పేరిట హైడ్రామా చేస్తున్నారు. చరిత్రలో నీలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రి ఎవరూ ఉండరు. రేవంత్ నీకంటే ముందు చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు. నువ్వు చిట్టి నాయుడివి.. నీలాంటి బుల్లబ్బాయిలను చాలా మందిని చూశాం. నువ్వు ఏం చేయలేవు. పదవి ఎవరికీ శాశ్వతం కాదు. నీ దుష్ట సంప్రదాయాలు కచ్చితంగా నిన్ను చుట్టుకుంటాయి.’ అని కేటీఆర్ అన్నారు.