AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రెస్టారెంట్ ప్రారంభోత్స‌వంలో కంది శ్రీ‌నివాస రెడ్డి.. నాయుడి గారి కుండ బిర్యాని ప్రారంభం

యాజ‌మాన్యానికి శుభాకాంక్ష‌లు తెలిపిన కెఎస్ ఆర్

అమ్మ‌న్యూస్ ఆదిలాబాద్ : ప‌ట్ట‌ణంలోని బ‌స్టాండ్ స‌మీపంలో కొత్త‌గా ఏర్పాటైన నాయుడు గారి కుండ బిర్యాని రెస్టారెంట్‌ను ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీ‌నివాస‌రెడ్డి పార్టీ శ్రేణుల‌తో క‌లిసి సంద‌ర్శించారు. కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రై రిబ్బ‌న్ క‌ట్ చేసి ప్రారంభోత్స‌వం చేశారు. యాజామాన్యానికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. భోజ‌నం రుచి చూసి బాగుదంటూ ప్ర‌శంసించారు. వ్యాపారం బాగా జ‌రిగి అభివృద్ధిలోకి రావాల‌ని ఆకాంక్షించారు.

జిల్లావాసుల‌కు కొత్త కొత్త రుచుల‌ను ప‌రిచయం చేస్తూ నాణ్య‌మైన‌ సేవ‌లందించాల‌ని సూచించారు. యాజ‌మాన్యం ఎన్నం వినిత్ కుమార్, దొంతుల వెంకటేష్ కంది శ్రీ‌నివాస రెడ్డిని శాలువాతో స‌త్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని,కౌన్సిలర్లు బండారి సతీష్,క‌లాల శ్రీ‌నివాస్ , ద‌ర్శ‌నాల ల‌క్ష్మ‌న్ ,నాయకులు ఎం.ఏ షకీల్,పోరెడ్డి కిషన్, బూర్ల శంక‌ర‌య్య‌, సింగిరెడ్డి రామ్ రెడ్డి,దాసరి ఆశన్న,సోమ ప్రశాంత్,బాసా సంతోష్,సునిల్,సంతోష్, అశోక్, షాహిద్,అస్బాత్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

ANN TOP 10