AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నటుడు మురళీమోహన్‌ ఆస్తులపై హైడ్రా ఫోకస్.. జయభేరీ సంస్థకు నోటీసులు

హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా కొంచెం గ్యాప్ ఇచ్చిన  హైడ్రా.. వర్షాలు తగ్గుముఖం పట్టటంతో మళ్లీ యాక్టివ్ మోడ్‌లోకి వచ్చేసింది. ఇప్పటికే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోన్న హైడ్రా.. అటు బడాబాబుల గుండెల్లోనూ బుల్డోజర్లను పరుగెత్తిస్తోంది. అక్రమంగా ఎఫ్టీఎల్ ఫరిధిలో, బపర్ జోన్ల పరిధుల్లో అక్రమ నిర్మాణాలు చేసిన వారిపై హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే.. అవి ఎవరివైనా సరే ఉపేక్షించకుండా ముందుకు సాగుతోంది. ఇప్పటికే.. పలువురు రాజకీయ నాయకుల ఫాంహౌసులు, విద్యాసంస్థలపైకి బుల్డోజర్లను పంపించిన హైడ్రా.. అటు సినీ ప్రముఖులకు సంబంధించిన ఆస్తులపై కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టింది.

ఈ క్రమంలోనే.. హైదరాబాద్ మాదాపూర్‌లో ఉన్న హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్- కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా అధికారులు   నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. ఈ కూల్చివేత.. తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్‌లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా.. ఇప్పుడు మరో సీనియర్ నటుడైన మురళీమోహన్‌కు సంబంధించిన ఆస్తిపై హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే.. మురళీమోహన్‌కు సంబంధించిన.. ప్రముఖ నిర్మాణ సంస్థ జయభేరికి హైడ్రా నోటీసులు జారీ చేసింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10