AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నా ఇల్లు బఫర్ జోన్‌లో ఉంటే కూల్చేయండి.. ప్రధాన ప్రతిపక్షానికి పొంగులేటి సవాల్‌

హైడ్రా పేరు వింటే అక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నిబంధనలను ఉల్లంఘించి.. బఫర్ జోన్‌లో నిర్మాణాలు చేపట్టినట్టు చిన్న సమాచారం అందితే చాలు.. దర్యాప్తు చేపట్టి వాటి భరతం పడుతోంది హైడ్రా. చెరువుల పరిరక్షణ, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటైన ‘హైడ్రా’ పరిధి ఔటర్‌ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్‌) వరకు ఉంటుందని ప్రభుత్వమే నిర్వచించింది. భాగ్యనగరవాసుల దాహార్తిని తీరుస్తున్న ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ జంట జలాశయాల పరిధిలోని అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం బుల్డోజర్లతో విరుచుకుపడుతోంది. అయితే, కేవలం కొందర్ని రాజకీయంగా టార్గెట్ చేసుకోవడానికే ఇలా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నారు.

ఆక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న హైడ్రా ముందుగా బఫర్ జోన్‌లో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఫామ్‌హౌజ్‌ను కూల్చివేయాలని బీఆర్ఎస్ నేత కేటీఆర్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేటీఆర్ తనపై చేసిన విమర్శలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నా ఇల్లు బఫర్ జోన్‌లో ఉన్నట్లు.. కేటీఆర్, హరీశ్‌రావు నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు. అలాగే ఎఫ్‌టీఎల్‌ బఫర్ జోన్‌లో నాకు సంబంధించి ఒక్క ఇటుక ఉన్నా టేప్ పెట్టి కొలిచి కూల గొట్టాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు చెబుతున్నానని చెప్పారు.

ఒకవేళ తాను అధికారంలో ఉన్నందున అధికారులపై నమ్మకం లేకపోతే మీరే వెళ్లి.. కొలిచి నిర్ణయించాలని కేటీఆర్‌, హరీశ్‌రావుకు సూచించారు. అంతేకాదు, కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులతో మాటలుపడే అవకాశం ఈ పొంగులేటి ఎప్పుడూ ఇవ్వబోడని అన్నారు. ప్రతిపక్ష హోదాను, పార్టీని కాపాడుకునేందుకు రెవెన్యూ మంత్రిగా ఉన్న నాపై అక్రమాల పేరుతో ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు, మీలాగా నేను ఉండే ఇల్లు నాది కాదని చెప్పనని పొంగులేటి అన్నారు.

జన్వాడ ఫామ్ హౌస్ తనది కాదు.. తన స్నేహితుడిదని, లీజుకు మాత్రమే తీసుకున్నానని చెబుతోన్న కేటీఆర్. అలాంటప్పుడు దానిపై డ్రోన్‌లు ఎగురవేశారని రేవంత్‌రెడ్డిపై కేసులు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. ఆ ఎఫ్‌ఐఆర్‌లో కేటీఆర్ నివాసంపైనే అక్రమంగా డ్రోన్‌లు ఎగరేశారని ఎందుకు పేర్కోన్నారని పొంగులేటి నిలదీశారు. మీలాగా నేను బుకాయించానని, నేను ఉంటున్న ఇల్లు ప్రస్తుతం నా కొడుకు పేరుతో ఉందని తెలిపారు. అయిననప్పటికి మీలాగా నేను తప్పించుకోనని, అది నా ఇల్లుగానే చెబుతానని అన్నారు.

ANN TOP 10