ఎన్నడూలేని విధంగా తెలంగాణకు భారీగా పెట్టుబడులు
అధికారం చేపట్టిన ఎనిమిది నెలల వ్యవధిలోనే రూ. 73 వేల కోట్లు
ఇది ఒక్క రేవంత్‌రెడ్డి సర్కార్‌కే సాధ్యమైందన్న కంది శ్రీనివాసరెడ్డి
అమ్మన్యూస్ ఆదిలాబాద్ః రేవంత్‌రెడ్డి మాటల సీఎం కాదని..చేతల ముఖ్యమంత్రి అని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్నాడూలేని విధంగా తెలంగాణకు భారీగా విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చారని, అది ఆయన సర్కార్‌కే సాధ్యమైందని కొనియాడారు. అమెరికా , సౌత్ కొరియా పర్యటన ముగించుకుని స్వదేశానికి వచ్చిన ఆయనకు ఆదిలాబాద్ నియోజకవర్గం తరపున సాదర స్వాగతం పలుకుతున్నట్టు తెలియజేశారు. ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని ప్రజాసేవా భవన్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల వ్యవధిలోనే 19 కంపెనీలతో ఒప్పందం చేసుకుని దాదాపు రూ.73 వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం ఆషామాషి విషయం కాదని పేర్కొన్నారు. ప్రజలకు మాట ఇస్తే తప్పని మనిషిగా..ఒక గొప్ప పరిపాలనాదక్షుడిగా రేవంత్‌రెడ్డి తనను తాను నిరూపించుకున్నారన్నారు. ఇప్పటికే ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీ హామీలను నెరవేర్చి ప్రజల ఆదరాభిమానులు చూరగొన్నారని, వారికి మరింత చేరువయ్యారని అన్నారు.
కేసీఆర్ హయాంలో ప్రజలకు ఒరిగిందేమీలేదని దుయ్యబట్టారు. ఆయన కుమారుడు కేటీఆర్ మొక్కుబడిగా వెళ్లి ఫొటోలు దిగిరావడం తప్పా ఏనాడు విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చిన దాఖలాలు లేవన్నారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర రూపురేఖలు మార్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు. కానీ బీఆర్ఎస్‌కు ఇది మింగుడుపడడంలేదన్నారు.తన పింక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా అమెరికాలో ఉండే రేవంత్‌రెడ్డి సోదరుడిపై పిచ్చిరాతలు రాయిస్తోందని, అసత్య ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. కొన్నేళ్లుగా ప్రజాసేవలో ఉన్న రేవంత్‌రెడ్డి కుటుంబంపై, ఆయన సోదరులపై క్షగట్టుకుని బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహించారు.
కాంగ్రెస్‌లో ఎవరైన పచ్చగ కన్పిస్తే ఓర్వడంలేదన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోనూ ఇందిరమ్మ ఇంట్లో ఉండి ఎమ్మెల్యేస్థాయికి ఎదిగిన గరీబోళ్ల బిడ్డ వెడ్మ బొజ్జుపై కూడా ఆరోపణలు చేసి తప్పుడు రాతలు రాయించారని, తప్పుడు ప్రచారాలు చేశారన్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తమ కాంగ్రెస్ నాయకులను బద్నాం చేస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వంపై బుదరజల్లడమే బీఆర్ఎస్ పనిగా పెట్టుకుందన్నారు. బలమైన సంకల్పం కలిగిన నాయకుడు రేవంత్‌రెడ్డి అన్నారు కంది శ్రీనివాసరెడ్డి. త్వరలోనే ఆదిలాబాద్ పర్యటనకు సీఎం రాబోతున్నారని తెలిపారు.
రాబోయే మరో పదేండ్లు సీఎంగా రేవంత్‌రెడ్డి తెలంగాణ దశదిశను మారుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుడిపెల్లి నగేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, లోక ప్రవీణ్ రెడ్డి, బేల మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్, మాజీ జడ్పీటీసీ రాందాస్ నాక్లే, బ్లాక్ కాంగ్రెస్ మండలాధ్యక్షులు సంజయ్ గుండావార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వామన్ వాంఖడే, కౌన్సిలర్లు దర్శనాల లక్ష్మణ్, నాయకులు సింగిరెడ్డి రామ్ రెడ్డి, విలాస్ సావాపురే, నానాజీ వైద్య, గంభీర్ టాక్రే, పోరెడ్డి కిషన్, ఎం.ఏ కయ్యుమ్, దర్శనాల చంటి, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.