(అమ్మన్యూస్, ఆదిలాబాద్):
ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలకు కంది శ్రీనివాసరెడ్డి గారి క్యాంప్ కార్యాలయం, ప్రజాభవన వేదికకానుంది. శుక్రవారం (నేడు) ఆదిలాబాద్ పట్టణంలోని కొమరంభీం కాలనీ నుంచి TNGO’s వరకు జరిగే ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలకు తుడుం దెబ్బ సంఘం సభ్యులు ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాస రెడ్డిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు గోడం గణేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెట్టి మనోజ్, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గోడం రేణుక, జిల్లా మహిళా ఉప అధ్యక్షురాలు ఉయిక ఇందిరా, డివిజన్ ఉప అధ్యక్షులు ఆత్రం గణపతి, యువజన సంఘం జిల్లా అధ్యక్షులు గేడం విష్ణు, మహిళా సంఘం డివిజన్ అధ్యక్షురాలు సోయం లలిత,నిరుద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మెస్రం దినేష్ తదితరులు పాల్గొననున్నారు.









