AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణలో రెండురోజులు భారీ వానలు.. ఎల్లో అలెర్ట్‌ జారీ చేసిన ఐఎండీ..!

తెలంగాణలో మరో రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల మూడురోజులు స్థిరమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో పలు జిల్లాల్లో వీస్తాయని పేర్కొంది. అలాగే, శుక్రవారం జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, మహబూబాబాద్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్‌, హన్మకొండ, మెదక్‌, కామారెడ్డి, నాగర్‌ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఇదిలా ఉండగా.. గడిచిన 24గంటల్లో నిజామాబాద్‌, జగితాల్య, ఆదిలాబాద్‌, వనపర్తి, సిరిసిల్ల, సూర్యాపేట, ములుగుతో పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాపాతం నమోదైందని టీజీ డీపీఎస్‌ వివరించింది.

ANN TOP 10