ఈడీ కేసులో ఆగస్టు 13 వరకు..
(అమ్మన్యూస్, హైదరాబాద్):
ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆమె జ్యుడీషియల్ కస్టడీని మళ్లీ పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఆగస్టు 9 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఈడీ కేసులో ఆగస్టు 13 వరకు జ్యుడిషియల్ రిమాండ్‌ను పొడిగించింది. ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కూడా కస్టడీని పొడిగించింది. తదుపరి విచారణను ఆగస్టు 9కి వాయిదా వేసింది. కాగా గడువు ముగియడంతో.. ముగ్గురిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు అధికారులు. ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవితకు షాక్ తగిలింది. ఆమె జ్యుడిషియల్ కస్టడీని ఆగస్టు 13వరకు పొడిగించింది.
4 నెలలుగా జైలులోనే..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె తీహార్ జైలులో జ్యూడీషియల్ ఖైదీగా ఉన్నారు. ఈ ఏడాది మార్చి 15న ఈడీ అధికారులు ఆమెను అరెస్టు చేయగా.. దాదాపు 4 నెలలుగా ఆమె జైలులోనే ఉన్నారు. బెయిల్ కోసం ప్రయత్నిస్తూ.. ఆమెను దురదృష్టం వెంటాడుతూనే ఉంది. ఆమెకు బెయిల్ దొర్కకపోగా..రిమాండ్ కొనసాగుతూనే ఉంది. తాజాగా.. మరోసారి కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఆగస్ట్ 13 వరకు జ్యూడిషియల్ రిమాండ్ పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.









