AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేటీఆర్‌ వర్సెస్‌ సీతక్క.. మాటల యుద్ధంతో దద్దరిల్లిన సభ

పదేళ్లుగా అన్ని వర్గాలను మోసం చేసింది బీఆర్‌ఎస్సే
అందుకే ప్రజలు మాక్కు పట్టం కట్టారు
ఓపికగా ఉండాల్సింది పోయి రెచ్చిపోతారా?
మంత్రి సీతక్క స్ట్రాంగ్‌ కౌంటర్‌
మాటలే.. చేతలేవీ అంటూ కేటీఆర్‌ ఫైర్‌

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
హైదరాబాద్‌: అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి సీతక్క విశ్వరూపం ప్రదర్శించారు. మంత్రి సతీక్క బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మధ్య మాటల యుద్ధం జరిగింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఏడో రోజూ వాడీవేడీగానే ప్రారంభమయ్యాయి. ద్రవ్య వినిమయ బిల్లుకుపై సభలో చర్చ జరిగింది. 2024 –25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2,91,159 కోట్లు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లు పై చర్చ ప్రారంభించారు. ఇక అక్కడి నుంచి కేటీఆర్‌ వర్సెస్‌ మంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యాలపై మంత్రి సీతక్క ఫైర్‌ అయ్యారు.. ఇచ్చిన హామీలు ఒక్కొక్క టి నెరవేరుస్తున్నామని, ప్రజలు సంతృప్తిగా ఉన్నారని.. మేము చేయకపోతే ప్రజలు బుద్ధి చెబుతారని.. ప్రతిపక్ష నేతలు కొంచం ఓపికగా ఉండండాలని సూచించారు.

ఓయూకు వెళ్లలేని పరిస్థితి బీఆర్‌ఎస్‌ నేతలది..
ఇంటింటికీ ఉద్యోగం పేరుతో పదేళ్లపాటు బీఆర్‌ఎస్‌ మోసం చేసిందని.. దీంతో పదేళ్ల పాటు ఓయూకు వెళ్లలేని పరిస్థితి తెచ్చుకున్నారని మంత్రి సీతక్క ఎద్దేవా చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్నా.. ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదని మంత్రి ప్రశ్నించారు. అశా వర్కర్లు, అంగ¯Œ వాడీల తల్లిదండ్రుల పింఛను గత ప్రభుత్వం తొలగించిందని, చిరుద్యోగుల తల్లిదండ్రుల పింఛను తీసేసింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని ఆమె తీవ్రస్థాయిలో ఆరోపించారు. ధరణి పేరుతో పేదలకు పట్టాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని, ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేకే ప్రజలు కాంగ్రెస్‌ పట్టం కట్టారని అన్నారామె. బీఆర్‌ఎస్‌ పాలనలో పేదలకు ఇళ్లు కూడా ఇవ్వలేదని, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు నెలలపాటు జీతాలు ఇవ్వలేదని మంత్రి సీతక్క విమర్శించారు.

కేటీఆర్‌ మాట్లాడుతూ..
ఓపికగా ఉండాల్సింది మంత్రులేనని.. తాము కాదని కేటీఆర్‌ అన్నారు. వందరోజులలో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ఎవరు చెప్పమన్నారని ప్రశ్నించారు. పోస్టులు పెంచమంటే పోలీసులతో దౌర్జన్యం చేయిస్తున్నారని, సన్నాసులు గ్రూప్‌ టూ వాయిదా వేయమంటున్నారని సీఎం రేవంత్‌ రెడ్డి అవమానిస్తున్నారని, జీవో 46 సవరించి ఉద్యోగులకు న్యాయం చేయాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. రైతు కష్టానికి ఖరీదు కట్టడమే తప్పని.. రైతు భరోసా రూ. 15వేలు ఇస్తామన్నారని.. బడ్జెట్లో ఎందుకు పెట్టలేదని నిలదీశారు. ఓట్లు లేవు కాబట్టి రైతు భరోసా ఇస్తారా? ఎత్త గొడతారా?.. రైతు డిక్లరేషన్‌లో చెప్పిన మాట నిలుపుకోవాలన్నారు. ఏకకాలంలో రుణమాఫీ చేస్తే రెండుసార్లు ప్రకటనలు ఎందుకని ప్రశ్నించారు.

ANN TOP 10