AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆ పదవి ఇస్తే వెంటనే కాంగ్రెస్‌లో చేరుతా: మల్లారెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధం అంటూ బహిరంగంగానే ప్రకటించారు. అయితే, ఆయనో చిన్న కండీషన్ పెట్టారు. ఆ కండీషన్‌కు అంగీకరిస్తేనే కాంగ్రెస్‌లో చేరుతానని.. లేదంటే చేరబోనని ప్రకటించారు. మరి ఇంతకీ మల్లారెడ్డి పెట్టిన కండిషన్ ఏంటి? ఇంతకీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మల్లారెడ్డిని కాంగ్రెస్‌లోకి రానిస్తారా? అసలు మల్లారెడ్డి నిజంగానే ఈ ఆఫర్ ఇచ్చారా? లేక ఫన్నీగా మాట్లాడారా? పూర్తి వివరాలు మీకోసం..

అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి మల్లారెడ్డి మీడియాతో చిట్‌ చాట్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఆ వార్తలకు తగ్గట్లుగానే మల్లారెడ్డి ప్రవర్తన కూడా ఉంటుంది. ఏనాడూ ఆయన ఈ వార్తలను ఖండించిన దాఖలాలు కూడా లేవు. తాజాగా.. దానికి కొనసాగింపు అన్నట్లుగా బిగ్ కామెంట్ చేశారు మల్లారెడ్డి. పార్టీ మారే అంశంపై బహిరంగంగానే ప్రకటించేశారు.

తనకు హోంమంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు మల్లారెడ్డి ప్రకటించారు. మరి ఇందుకు సీఎం అంగీకరిస్తారా? అని కూడా మల్లారెడ్డి సందేహం వ్యక్తం చేశారు. వందశాతం సీఎం తనను రానివ్వడని కూడా అన్నారు. తనను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే మధ్యవర్తిత్వం చేయాలని జర్నలిస్టులను సైతం కోరారు మల్లారెడ్డి. హోంమంత్రి పదవి ఇచ్చేటట్లు సీఎంతో మాట్లాడాలని జర్నలిస్టులను మల్లారెడ్డి కోరారు. బీఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి గెలిస్తే తతన ప్లేస్ వేరే లెవెల్‌లో ఉంటుండేనని అన్నారు. తాము మూడోసారి గెలిస్తే ఖచ్చితంగా హోంమంత్రి అవుతుండేనని అన్నారు.

ANN TOP 10