AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అసెంబ్లీలో బీఆర్ఎస్ నిరసన.. డిప్యూటీ సీఎం భట్టి ఫైర్

తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా మంగళవారం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య హాట్ హాట్‌గా డిబేట్ జరిగింది. సివిల్ సప్లై పద్దుల విషయమై బీఆర్ఎస్ నిరసనకు దిగింది. వెల్‌లోకి దూసుకొచ్చింది. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. బీఆర్ఎస్ లేవనెత్తిన ప్రశ్నలకు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సవివరింగా సమాధానాలు చెప్పారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఇది సభనా? బస్టాండా? అంటూ ఆగ్రహించారు. సభా మర్యాదలు కాపాడేవాళ్లు మాత్రమే సభలో ఉండాలన్నారు. తాము స్లోగన్లకు భయపడేవాళ్లం కాదని స్పష్టం చేశారు. తాను కూడా సీఎల్పీ నాయకుడిగా చేశానని, కానీ, తాము ఎప్పుడైనా ఇలా వ్యవహరించామా? అని ప్రశ్నించారు.

తెల్ల రేషన్ కార్డుల అంశంపై కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్‌కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఇక కేటీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. సివిల్ సప్లై శాఖలో భారీ అవినీతి జరిగిందని, రూ. 1,100 కోట్ల స్కాం జరిగిందని ఆరోపించారు. ఈ స్కాంపై హౌజ్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. మిల్లర్ల నుంచి ధాన్యం తీసుకోవాలని, డబ్బులు కాదని గంగుల కామెంట్లు చేశారు. మద్దతు ధర ఇస్తామని ఇవ్వలేదని, ఇచ్చిన హామీలు అన్నింటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ANN TOP 10