AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విద్యుత్‌ కమిషన్‌ చైర్మన్‌గా జస్టిస్‌ లోకూర్‌

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
తెలంగాణ విద్యుత్‌ కమిషన్‌ చైర్మన్‌గా జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌ నియామకం అయ్యారు. జస్టిస్‌ నరసింహారెడ్డి స్థానంలో మదన్‌ బీ లోకూర్‌ నియమితులయ్యారు. గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ జస్టిస్‌గా లోకూర్‌ పనిచేశారు.

ఇటీవల జస్టిస్‌ నరసింహారెడ్డిని తప్పుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీం ఆదేశాలతో కమిషన్‌కు కొత్త చైర్మన్‌ను ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే దాదాపుగా కమిషన్‌ విచారణ పూర్తయింది. విద్యుత్‌ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ విచారణకు కమిషన్‌ వేసింది ప్రభుత్వం. 2011లో ఉమ్మడి హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా మదన్‌ బీ లోకూర్‌ పనిచేశారు. గతంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఆయన పనిచేశారు.

ANN TOP 10