(అమ్మన్యూస్, హైదరాబాద్):
ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నిర్మల్ నుంచి ప్రకాశం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణికురాలిపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. కదులుతున్న బస్సులోనే మహిళ నోట్లో గుడ్డలు కుక్కి మరీ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది. మహిళ అరుపులు విన్న తోటి ప్రయాణికులు 100 నంబర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ఓయూ పీఎస్ పరిధిలో బస్సును ఆపి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.









