రాష్ట్ర బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం.. రాష్ట్ర బడ్జెట్‌కు (Telangana Budget) మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మధ్యాహ్నం 12 గంటలకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క శాసన సభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్‌కు (Telangana Budget) మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మధ్యాహ్నం 12 గంటలకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క శాసన సభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా బడ్జెట్‌ను మంత్రివర్గం ఆమోదించింది. మరికాసేపట్లో భట్టివిక్రమార్క రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. గవర్నర్ సీపీ రాధాకృష్ణకు బడ్జెట్ పద్దును అందించారు. బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతి తీసుకోనున్నారు.
అనంతరం స్పీకర్ ప్రసాద్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డికి బడ్జెట్ ప్రతులను అందిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు శాసన సభలో భట్టివిక్రమార్క, శాసన మండలిలో మంత్రి శ్రీధర్‌బాబు బడ్జెట్‌ను ప్రవేశపెడుతారు. అంతకుముందు ప్రజాభవన్‌లోని నల్లపోచమ్మ ఆలయంలో భట్టి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.









