బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను పార్టీ అధినేత కేసీఆర్ ఆశీర్వదించారు. తన పుట్టిన రోజు సందర్భంగా కేటీఆర్ తన తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు. బుధవారం నందినగర్‌లోని నివాసంలో కేసీఆర్‌ను, శోభమ్మను తన సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షుతో కలిసి కేటీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ‘నూరేళ్లు వర్థిల్లూ’ అంటూ కేటీఆర్‌ను కేసీఆర్ దీవించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ భవన్‌లో రక్తదానం…
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. బీఆర్‌ఎస్‌వీ నాయకులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. అంతకు ముందు భారీ కేక్‌ను మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మాజీ ఎంపీలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, లింగయ్య యాదవ్, బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌లు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు రాకేశ్ కుమార్, రామ్మూర్తి యాదవ్, రాజీవ్ సాగర్, పల్లె రవి కుమార్, రూప్ సింగ్, అంజనేయ గౌడ్, బీఆర్‌ఎస్‌వీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.









