పదవీ కాలం పూర్తి చేసుకున్న ప్రజా ప్రతినిధులను సత్కరించిన కంది శ్రీనివాస రెడ్డి
ఆదిలాబాద్ : రాబోయే ఎన్నికలకు సన్నద్ధమై కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నిలపాలని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజాసేవా భవన్ క్యాంపు కార్యాలయంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఇటీవల ఐదేండ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచుల తో భేటీ అయ్యారు. వారిని శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.వారు చేసిన సేవలను కొనియాడారు. అన్ని పంచాయితీలు మండల పరిషత్ జిల్లా పరిషత్ లను కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ప్రతీ గ్రామంలోనూ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలన్నారు.
మీ అందరి కృషి వల్లే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పెరిగిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అది స్ఫష్టమైందన్నారు.ఈ కార్యక్రమం లో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి,జైనథ్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి – వెంకట్ రెడ్డి,డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి శ్రీధర్,ఆదివాసీ జిల్లా చైర్మన్ సెడ్మాకి ఆనంద్ రావు,జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ,ఎన్.ఎస్.యూ.ఐ జిల్లా అధ్యక్షులు రంగినేని శాంతన్ రావు,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చరణ్ గౌడ్,ఐ.ఎన్.టి.యూ.సి జిల్లా అధ్యక్షులు మునిగేల నర్సింగ్,మాజీ ఎంపీటీసీలు కోడిచర్ల సుదర్శన్,జంగు పటేల్,మనోజ్,నాయకులు గిమ్మ సంతోష్,బాయిన్ వార్ గంగా రెడ్డి,అల్లూరి భూమ రెడ్డి,యాల్ల పోతా రెడ్డి,తమ్మల చందు,బండి దేవిదాస్ చారి,సుధాకర్ గౌడ్,భోజా రెడ్డి,కోరెడ్డి కిషన్,అల్లూరి అశోక్ రెడ్డి,అడ్డి రూకేష్ రెడ్డి,గడ్డం జగదీష్ రెడ్డి,పిడుగు స్వామి,ఎం.ఏ కయ్యుమ్,సహిద్ ఖాన్,రాజ్ మొహమ్మద్,సురేందర్ రెడ్డి,ఎల్మ రామ్ రెడ్డి,చిత్రు,ఓరగంటి అఖిల్,సోమ ప్రశాంత్,మల్లయ్య,పోతా రెడ్డి,ఏనుగు రవీందర్ రెడ్డి,పాట్న అమూల్,దర్శనాల చంటి,మహమూద్,సమీ ఉల్లా ఖాన్,అల్లాబకష్,మహిళా నాయకురాలు శ్రీలేఖ ఆదివాసీ,అఫ్రోజ్,రూప తదితరులు పాల్గొన్నారు.