AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్‌ఎస్‌ మరో వికెట్‌ ఔట్‌.. హస్తం గూటికి గద్వాల ఎమ్మెల్యే

కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌ సక్సెస్‌..
కేసీఆర్‌కు బిగ్‌ షాక్‌
రేవంత్, దీపాదాస్‌మున్షీ సమక్షంలో చేరిన ‘బండ్ల’
రేపు మరో నలుగురు చేరే అవకాశం

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో బిగ్‌ షాక్‌ తగిలింది. బీఆర్‌ఎస్‌ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ మేరకు శనివారం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌ రెడ్డి నివాసానికి చేరుకున్న ఆయన.. కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జీ దీపాదాస్‌ మున్సీ సమక్షంలో హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు.

కాంగ్రెస్‌ దూకుడు..
కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ఆపరేషన్‌ ఆకర్ష్‌ దూకుడుగా కొనసాగుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌ పార్టీలో చేరగా.. రేపు మరో నలుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరే అవకాశం ఉందని సమాచారం. కాగా, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ రెడ్డితో కలిపి ఇప్పటివరకు ఏడుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు ఎనిమిది మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌ గూటికి చేరుకున్నారు.

ANN TOP 10