AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హీరో రాజ్‌తరుణ్‌పై లవర్‌ లావణ్య సంచలన ఆరోపణలు.. పెళ్లి చేసుకుంటానని..

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పై అతని ప్రేయసి లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వదిలేసి వెళ్లిపోయాడని, అందుకు ఓ సినీ నటే కారణమని ఆరోపించింది. ఈ క్రమంలోనే ఆ సినీ నటితో పాటూ ఆమె సోదరుడిపై నార్సింగి పోలీస్ స్టేషన్ లో లావణ్య ఫిర్యాదు చేసింది. రాజ్‌ తరుణ్ ను వదిలేయకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని బెదిరిస్తున్నారు.

11 ఏళ్లుగా రాజ్‌తరుణ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాం. కానీ తన సినిమాలో నటిస్తున్న హీరోయిన్ తో అఫైర్‌ పెట్టుకొని నన్ను వదిలేశాడు. 3 నెలల క్రితం రాజ్ ఇంటి నుంచి వెళ్లిపోయి దూరంగా ఉంటున్నాడు. రాజ్‌ను వదిలేయకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని బెదిరిస్తున్నారు.

రాజ్‌ తరుణ్‌ నా ప్రపంచం..రాజ్‌ నాకు కావాలి.నాకు న్యాయం చేయాలని లావణ్య డిమాండ్‌ చేసింది. అలాగే గతంలో తనను డ్రగ్స్‌ కేసులో కావాలనే ఇరికించారని, అరెస్టై 45 రోజులు జైల్లో ఉన్నానాని, ఆ సమయంలో రాజ్‌ తనకెలాంటి సాయం చేయలేదని లావణ్య వెల్లడించింది. దీంతో ఇది కాస్త ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ANN TOP 10