AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

త్వరలో మంత్రివర్గ విస్తరణ.. సీతక్కకు హోమంత్రి ఇచ్చే అవకాశం : మంత్రి దామోదర

త్వరలోనే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆయన సోమవారం మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలువురి మంత్రులశాఖలు సైతం మారే అవకాశాలున్నాయన్నారు. సీతక్కకు హోంమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందన్నారు.

రాజగోపాల్‌రెడ్డి, దానం నాగేందర్‌, నిజామాబాద్‌ నుంచి ఒకరికి మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశం ఉందన్నారు. రాజకీయాలు పరిస్థితులను బట్టి మారుతుంటాయన్నారు. 2018 ఎన్నిలకు ముందు ప్యారాషూట్లకు టికెట్లు లేవని రాహుల్‌ గాంధీ చెప్పారని.. కానీ పరిస్థితుల దృష్ట్యా టికెట్ల కేటాయింపు జరిగిందన్నారు. త్వరలో వైద్యశాఖలో ప్రక్షాళన, సంస్కరణలు తీసుకువస్తామన్నారు. వైద్యశాఖలో రెండే విభాగాలు ఉండాలన్నారు. ఇందులో ఒకటి అడ్మినిస్ట్రేషన్‌, రెండు ఎడ్యుకేషన్‌ అన్నారు.

ANN TOP 10