AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైపర్‌ ఆదికి ఎమ్మెల్సీ!.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కీలక నిర్ణయం

త్వరలో పదవితో గౌరవించాలని డిసైడ్‌..
(అమ్మన్యూస్, అమరావతి):
హైపర్‌ ఆది బంపర్‌ ఆఫర్‌ కొట్టేశారు. త్వరలో ఎమ్మెల్సీ పదవి దక్కనున్నట్లు సమచారం. జబర్దస్త్‌ షో ద్వారా ఫేమస్‌ అయిన వారిలో హైపర్‌ ఆది ఒకరు. తన కామెడీ టైమింగ్స్, పంచ్‌లతో నవ్వించి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ తెచ్చుకున్నారు. అదేవిధంగా మొన్న జరిగిన ఎన్నికల్లో పవన్‌ కోసం పిఠాపురం వెళ్లి అక్కడ కొన్ని రోజులు ఉండి ప్రచారం చేశారు. పవన్‌ కల్యాణ్‌ గారిని ఏమైనా అంటే నేను రియాక్ట్‌ అవుతాను అంటూ పవన్‌పై తనకు ఉన్న అభమానాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఇక రీసెంట్‌ గా పవన్‌ కల్యాణ్‌ ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచి డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

అయితే తన కోసం తన పార్టీ జనసేన కోసం ఎలాంటి లాభాపేక్ష లేకుండా కష్టపడ్డ హైపర్‌ ఆది మంచి పదవితో గౌరవించాలనుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వంలో త్వరలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి హైపర్‌ ఆదికి ఇవ్వాలని డిసైడ్‌ అయినట్లు సమాచారం. ఈ రకంగా తనను నమ్ముకుంటే భవిష్యత్తులో మంచి పదవులు వస్తాయనే సంకేతం ఇచ్చినట్టు అవుతుందనే ఉద్దేశంతో హైపర్‌ ఆదికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ముందుగా హైపర్‌ ఆది సహా పార్టీ కోసం పనిచేసిన సినిమా వాళ్లకు తగిన గౌరవం ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ANN TOP 10