AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డుపై ఘోర ప్రమాదం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా

రంగారెడ్డి జిల్లా నార్సింగి ఔటర్ రింగు రోడ్డుపై ఘోర ప్రమాదం సంభవించింది. అతివేగంతో వచ్చిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో.. బస్సు చక్రాల కింద పడి ఇద్దరు ప్రయాణికులు ప్రాణాలొదిలారు. అప్పటికే వర్షం పడగా.. రోడ్డు మొత్తం తడిగా ఉండటం.. బస్సు వేగంగా వస్తుడటంతో.. ఒక్కసారిగా అదుపుతప్పి బస్సు ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్తున్న బస్సు ఒక్కసారిగా బోల్తాకొట్టటంతో.. కిటీల్లోకి బయటపడి టైర్ల కింద నలిగి ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలొదిలినట్టు తెలుస్తోంది. మరో 15 మందికి గాయాలుకాగా.. క్షతగాత్రులందరినీ హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. సుమారు 9 గంటల సమయంలో బస్సు బోల్తాపడడంతో.. ఔటర్ రింగు రోడ్డుపై దాదాపు ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.


మార్నింగ్‌ స్టార్‌ ట్రావెల్‌కు చెందిన బస్సు విజయవాడ నుంచి హైదరాబాద్ ఔటర్‌ రింగ్‌రోడ్డు మీదుగా ముంబయికి వెళ్తున్నట్లు సమాచారం. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బస్సులో ఇరుక్కున్న ప్రయాణికులను వెలికి తీశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించటంతో పాటు.. క్రేన్‌ సహాయంతో రోడ్డుపై నుంచి బస్సును తొలగించారు.

ANN TOP 10