AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అటు అకీరా.. ఇటు ఆద్య – భార్యాపిల్లలతో పవన్‌కల్యాన్‌

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రమాణ స్వీకారం చేసి రెండు రోజులు కూడా కాలేదు.. అప్పుడే ప్రజల సేవలో పడిపోయారు. నిత్యం ఫైల్స్, ప్రజల కష్టాలను వింటూ ఆ సమస్యలకు పరిష్కారాలు వెతుకుతున్నారు. ఇక పవన్‌.. కుటుంబంతో ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోతున్న విషయం తెల్సిందే. ఈ ఎన్నికల సమయం నుంచే అకీరా.. పవన్‌ తో పాటే ఉంటున్నాడు.

ఇక పవన్‌ మాజీ భార్య రేణు దేశాయ్‌.. పవన్‌ కు దూరమైనా.. పిల్లలను తండ్రికి ఎప్పుడు దగ్గరగా ఉంచుతోంది. పవన్‌ ప్రమాణ స్వీకారం చేసిన రోజున.. రేణు పిల్లలు అకీరా, ఆద్య కూడా వచ్చారు. అయితే వీరితో ఎప్పుడు పవన్‌ కలిసి కనిపించలేదు. అకీరా ఉంటే .. ఆద్య ఉండదు. ఆద్య ఉంటే అకీరా మిస్‌ అవుతున్నాడు. ఈ ఇద్దరు అన్నాచెల్లెళ్లు.. తండ్రితో ఉన్న ఫోటో చాలా రేర్‌ అని చెప్పాలి.

ఇక తాజగా ఆ లోటు తీరిపోయింది. ఈ ఇద్దరు అన్నాచెల్లెళ్లు తండ్రితో కలిసి దిగిన ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేసిన తరవాత క్లిక్‌ అనిపించిన అందమైన ఫొటో ఇది. ఈ ఫొటో చూసిన నెటిజన్లు రెండు కళ్లు చాలడంలేదని కామెంట్లు పెడుతున్నారు.

ANN TOP 10