AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత పర్యటనలో అపశృతి.. బీజేపీ నేతకు తీవ్రగాయాలు

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత కాన్వాయికి ప్రమాదం జరిగింది. మంత్రి వంగలపూడి అనిత వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వెళ్తుండగా.. ప్రమాదం జరిగింది. అలిపిరి గరుడ సర్కిల్ వద్ద.. హోం మంత్రి కాన్వాయ్ లోని ఒక కారు ప్రమాదవశాత్తు బీజేపీ మండల నాయకుడు ప్రభాకర్ నాయుడు కారుపైకి ఎక్కింది.

ఈ ప్రమాదంలో ప్రభాకర్ కు తీవ్రగాయాలు కావడంతో.. పోలీసులు ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రభాకర్ కు మెరుగైన చికిత్స అందించాలని హోంమంత్రి అనిత వైద్యులను ఆదేశించారు. ఈ ప్రమాద ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ANN TOP 10