AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కంది శ్రీనన్న అసెంబ్లీలో అడుగు పెట్టే వరకు పాదరక్షలు ధరించను..

ఓ అభిమాని అకుంఠిత దీక్ష
జైన‌థ్ ల‌క్ష్మీనారాయ‌ణ స్వామి స‌న్నిధిలో శపథం
ప్రజా నేత కంది శ్రీ‌నివాస రెడ్డి పై ఉప్పొంగిన అభిమానం

అమ్మన్యూస్ ప్రతినిధి ఆదిలాబాద్ :
అభిమానానికి హ‌ద్దులుండ‌వంటారు. నిత్యం ప్రజ‌ల కోసం త‌పించే ఆదిలాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి లాంటి నిజ‌మైన నిఖార్సైన జ‌న‌నేత పై ప్రజ‌లు త‌మ అభిమానాన్ని చాటుతున్నారు. ఆయ‌న చేస్తున్న ప్రజోప‌యోగ కార్యక్రమాల్లో త‌మ వంతుగా త‌మ అభిమానాన్ని ప్రద‌ర్శిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీయే త‌న స‌ర్వస్వంగా భావించి పార్టీ బ‌లోపేతం కోసం ప్రజ‌ల ఆద‌ర‌ణ కోసం అనునిత్యం శ్రమిస్తూ త‌న ధ‌నాన్ని, పూర్తి స‌మ‌యాన్ని వెచ్చిస్తున్న కంది శ్రీ‌నివాస రెడ్డిపై ఓ అభిమాని అభిమానం కాస్తా దీక్షగా మారింది. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ మండల అధ్యక్షులు పిడుగు స్వామి యాదవ్ అకుంఠిత భ‌క్తి ప్రప‌త్తుల‌తో తన ఇష్ట దైవమైన జైనథ్ లోని సుప్రసిద్ధ లక్ష్మి నారాయణ స్వామి ఆలయ ప్రాంగణం లో కఠోర మైన దీక్ష శ‌ప‌థం చేసారు.


పేద‌ల పెన్నిధి ప్రజ‌ల మ‌నిషి కంది శ్రీ‌నివాస రెడ్డి ఎమ్మెల్యే గా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టే వ‌ర‌కు పాద‌రక్షలు ధ‌రించ‌న‌ని ఆ స్వామి వారి స‌న్నిధిలో ప్రమాణం చేస్తూ దీక్ష చేప‌ట్టారు. నియోజ‌క‌వ‌ర్గంలో పూర్తిగా బ‌ల‌హీన ప‌డి జ‌వ‌స‌త్వాలు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి కంది శ్రీ‌నివాస రెడ్డి కొత్త ఊపిరిలూదార‌ని పార్టీలో నూతనోత్తేజం తెచ్చార‌ని ఆయ‌న అన్నారు.అలాంటి మంచి వ్యక్తి పార్టీకి వీర‌విధేయుడు లాంటి త‌మ అభిమాన నేత‌ను ఎమ్మెల్యేగా చూడాల‌న్నది నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌ల ఆశ అని ఆ ఆశ‌ను త‌న ఆశ‌యాన్ని నెర‌వేర్చేలా క‌రుణా క‌టాక్షాలు చూపాల‌ని స్వామి యాద‌వ్ భ‌గ‌వంతున్ని ప్రార్థించారు. కష్టకాలం లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వెన్నుద‌న్నుగా నిలిచి మైన‌స్ లో ఉన్న ఓటు బ్యాంకును ప్లస్‌గా మ‌లిచి లోక్ స‌భ ఎన్నిక‌ల్లో 77 వేల పైచిలుకు ఓట్లు సాధించేలా కృషి చేసిన కార్యోన్ముఖుడు కంది శ్రీనివాసరెడ్డి అని కొనియాడారు. ఆయ‌న రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీ తో అసెంబ్లీ లో అడుగు పెడతారని ధీమా వ్యక్తం చేస్తూ అప్పటివరకు పాదరక్షలు వేసుకోనని దీక్ష చేప‌డుతున్నట్టు తెలిపారు.ఆయ‌న దీక్ష ప‌ట్ల కంది శ్రీ‌నివాస రెడ్డి పై చూపిస్తున్న అభిమానానం ప‌ట్ల కాంగ్రెస్ శ్రేణులు హ‌ర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ANN TOP 10