AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు.. పవన్‌ కల్యాణ్‌కు పంచాయతీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

లోకేష్‌కు ఐటీ..
వంగలపూడి అనితకు హోంశాఖ

(అమ్మన్యూస్, అమరావతి):
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో రెండు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఇటీవల ప్రమాణం స్వీకారం చేసిన మంత్రులకు ఎట్టకేలకు సీఎం చంద్రబాబు శాఖలు కేటాయించారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు అడవులు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పర్యావరణ శాఖలు అప్పగించారు. టీడీపీ నేత వంగలపూడి అనితకు కీలకమైన హోంశాఖను అప్పగించారు.

శాఖల వివరాలిలా..

నారా చంద్రబాబు : ముఖ్యమంత్రి

పవన్‌ కల్యాణ్‌ : డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖలు

నారా లోకేష్‌ : మానవ వనరులు అభివృద్ధి, ఐటీ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్‌ శాఖలు

అచ్చెన్నాయుడు : వ్యవసాయశాఖ

నాదెండ్ల మనోహర్‌ : ఆహారం, పౌరసరఫరాల శాఖ

వంగలపూడి అనిత : హోం మంత్రిత్వ శాఖ

పొంగూరు నారాయణ : పురపాలకశాఖ, పట్టణాభివృద్ధి

సత్యకుమార్‌ యాదవ్‌ : ఆరోగ్యశాఖ

నిమ్మల రామానాయుడు : నీటిపారుదల శాఖ

మహ్మద్‌ ఫరూఖ్‌ : న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమం

ఆనం రామనారాయణరెడ్డి : దేవాదాయ శాఖ

పయ్యావుల కేశవ్‌ : ఆర్థిక శాఖ

అనగాని సత్యప్రసాద్‌ : రెవెన్యూ శాఖ

కొలుసు పార్థసారథి: హౌసింగ్, ఐ –్కఖశాఖలు

డోలా బాలవీరాంజనేయస్వామి: సాంఘిక సంక్షేమ శాఖ

గొట్టిపాటి రవికుమార్‌ : విద్యుత్‌ శాఖ

కందుల దుర్గేష్‌ : పర్యాటకం, సాంస్కృతిక శాఖలు

గుమ్మడి సంధ్యారాణి : స్త్రీ, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖలు

బీసీ జనార్దన్‌ : రహదారులు, భవనాల శాఖలు

టీజీ భరత్‌: పరిశ్రమల శాఖ

ఎస్‌.సవిత : బీసీ సంక్షేమం, హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ శాఖలు

ANN TOP 10