AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నటుడు పృథ్వీరాజ్‌కు నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌

(అమ్మన్యూస్, విజయవాడ):
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హాస్య నటుడు పృథ్విరాజ్‌కు విజయవాడ స్థానిక ఫ్యామిలీ కోర్టు అతడికి నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. మనోవర్తి చెల్లించాలంటూ పృథ్వీ భార్య బలిరెడ్డి శ్రీలక్ష్మి అతడిపై ఫ్యామిలీ కోర్టులో వేసిన కేసులో ఈ పరిణామం చోటుచేసుకుంది. భార్య బలిరెడ్డి శ్రీలక్ష్మికి నెలకు రూ.8 లక్షలు చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది.

అయితే ఈ ఆదేశాలను పాటించని పృథ్వీ హైకోర్టులో సవాలు చేశారు. కేసును పరిశీలించిన న్యాయస్థానం తాత్కాలిక ఉపశమనం కల్పిస్తూ భార్యకు నెలకు రూ.22వేల చొప్పున చెల్లించాలని ఆదేశించింది. అప్పటి వరకు ఉన్న బకాయిలు మొత్తం చెల్లించాలని స్పష్టం చేసింది. అయితే పృథ్వీరాజ్‌ హైకోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయలేదు.

దీంతో భార్య శ్రీలక్ష్మి తన న్యాయవాదులు సుంకర రాజేంద్రప్రసాద్, సప్పా రమేష్, సీహెచ్‌ వడ్డీకాసులును సంప్రదించి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్‌ వేశారు. పృథ్వీరాజ్‌ కోర్టుకు హాజరుకాకుండా కేసు వివరాలను ఒక దినపత్రికలో ప్రకటన చేశారని, కోర్టుకు హాజరుకావడం లేదని లాయర్లు పిటిషన్‌లో వివరించారు. ఫ్యామిలీ కోర్టు జడ్జి పిటిషన్‌ను పరిశీలించారు. పృథ్విరాజ్‌కు నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంటు జారీ చేశారు.

ANN TOP 10