(అమ్మన్యూస్, అమరావతి):
ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన పవన్ కల్యాణ్‌కు రేణూ దేశాయ్ స్పెషల్ విషెస్ చెప్పారు. పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీతోపాటు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవితోపాటు సాయి ధరమ్ తేజ్, రామ్ చరణ్, మెగా ఫ్యామిలీ పాల్గొన్నది. మరోవైపు మెగా ఫ్యామిలీ మొత్తం ప్రత్యేక బస్సులలో ప్రమాణ స్వీకార వేదిక వద్దకు వచ్చారు. అలాగే తండ్రి కోసం అకీరా నందన్, ఆద్య కూడా హాజరయ్యారు.
పవన్ ప్రమాణ స్వీకారానికి అకీరా, ఆద్య సంప్రదాయంగా పద్ధతిగా వచ్చారు. అకీరా పంచె కట్టగా.. ఆద్య ఎంతో చక్కగా ట్రెడిషనల్ గా కనిపించింది. అన్నచెల్లెలు ఇద్దరూ చాలా చక్కగా రెడీ అయ్యి తమ తల్లి రేణు దేశాయ్ కు వీడియో కాల్ చేశారు. తన పిల్లల ఫొటో షేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ కు విషెస్ తెలిపింది దేణూ దేశాయి. ‘‘నా పిల్లలు వాళ్ల నాన్న బిగ్గెస్ట్ డే రోజు ఇలా రెడీ అయ్యారు. ఏపీ స్టేట్ కి కల్యాణ్ .. మంచి చేయాలని శుభాకాంక్షలు’’ అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం రేణూ దేశాయ్ పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.









